సమర్పించిన చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలు, సాధించిన విజయాలతో సమగ్ర నివేదికను రూపొందించింది. ఈ నివేదకను సోమవారం లోక్‌భవన్‌లో నిర్వహించిన వైస్ ఛాన్సలర్ల సమావేశం సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు సమర్పించారు. 2024 నుంచి 2025 డిసెంబర్ వరకు జాతీయ విద్యా విధానం-2020 మార్గదర్శకాలకు అనుగుణంగా మండలి విధాన జోక్యాలు, ప్రవేశాల సంస్కరణలు, పరీక్ష వ్యవస్థ మెరుగుదల, పరిశోధన ప్రోత్సాహం, విద్యార్థి కేంద్రిత కార్యక్రమాలపై ఇందులో వివరాలున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ – 2047 లక్ష్య సాధన కోసం విశ్వవిద్యాలయాలు, మండలి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరముందని సూచించారు.
గవర్నర్‌కు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నివేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



