Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుండి పది పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

రేపటి నుండి పది పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
రేపటి నుంచి పది పబ్లిక్ పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయని మండల విద్యాధికారి పింజా రాజా గంగారం శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షలు పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు కొనసాగుతాయి అని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలని సూచించారు. 9:30 నుంచి 5 నిమిషాలు గ్రేస్ పీరియడు ఇస్తామని తెలిపారు. తర్వాత విద్యార్థులను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.

మండలంలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 13 పరీక్ష కేంద్రాలలో 106 ఇన్విజిలెటర్లను నియమించడం జరిగిందని తెలిపారు. మండలంలో మండలంలో మొత్తం 18 95 మంది పరీక్షకు హాజరు కాబోతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలు, పోలీస్ బందో బస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జట్లను లోపలికి అనుమతించమని అన్నారు. తల్లి దండ్రులు పిల్లలను సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేట్లు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -