Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట.!

పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట.!

- Advertisement -

కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు
నవతెలంగాణ- మల్హర్ రావు
: సరస్వతి పుష్కరాల నిర్వహణలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ప్రేస్టేషన్లో పిచ్చి పిచ్చిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,కాటారం మాజీ ఎంపిపి పంథకాని సమ్మయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం కాటారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరాస్వతి పుష్కరాలను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దగ్గరుండి అన్నీ తానై భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ జిల్లా యంత్రాంగంతో ప్రణాళికలు రూపొందిస్తూ భక్తులచే మన్ననలు పొందుతుంటే చూసి మధు తట్టుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు చలువ పందిళ్లు, ఘాట్లకు వెళ్లే రోడ్లు,టెంట్ సిటీ, పారిశుద్యం, మెడికల్ సౌకర్యాలు,పుష్కర ఘాట్ల వరకు ఉచిత బస్ సౌకర్యం, వేరు వేరుగా పార్కింగ్ ఏర్పాట్లు,పోలీస్ రక్షణలో ఎంతో ఘనంగా,పటిష్టంగా నిర్వహిస్తుంటే పుష్కరాల కోసం కాళేశ్వరానికి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులను చూసి మదుకు పిచ్చెక్కిపోయిందన్నారు. మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రేస్టేషన్ లో ఒక సీనియర్ మహిళ ఐఏఎస్ అధికారి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహిళని చూడకుండా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం  సరికాదన్నారు. అత్యున్నత సర్వీస్ ఐఏఎస్,అలాంటి ఒక సీనియర్ మహిళ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పుట్ట మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -