నవతెలంగాణ-హైదరాబాద్: విశాఖపట్నం ఎయు కన్వెన్షన్ సెంటర్ (అనతలవట్టం ఆనందన్ నగర్) వేదికగా … జరుగుతున్న సిఐటియు అఖిల భారత మహాసభలు శనివారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. మొదటిగా కార్యదర్శి నివేదికపై చర్చలు నిర్వహించనున్నారు. అనంతరం సిఐటియు అఖిల భారత నాయకుల ప్రెస్ మీట్ జరగనుంది. తరువాత తీర్మానాలు చేయనున్నారు. ఆ తరువాత వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం పలువురు నేతల ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అయితే సిఐటియు 18వ అఖిల భారత మహాసభను పురస్కరించుకొని … ఎయు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన శ్రామిక ఉత్సవ్ చివరిరోజు శుక్రవారం సాయంత్రం సందడిగా సాగింది. ఆట, పాట, మాటలు, ప్రదర్శనలతో ఆద్యంతం కళాకారుల బృందాలు చూపరులను మరింత ఉత్తేజితంగా చేశారు. ప్రజానాట్యమండలివారి పాటలు, నృత్యాలు, గేయాలు అందరినీ హోరెత్తించాయి. జివిఎంసి కళాకారుల తీన్‌మార్, డప్పు కళాకారుల ప్రదర్శనలు ప్రాంగణాన్ని మరింత ఉత్సాహవంతం చేశాయి.
నాల్గో రోజు ఘనంగా సీఐటీయు మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



