Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

- Advertisement -

ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు 
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

పాలకుర్తి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులను పూర్తి చేసి 74 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. 1774 కోట్ల 50 లక్షలతో పాలకుర్తి నియోజకవర్గం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు రాష్ట్ర మంత్రుల సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించడంలో, లో వోల్టేజి సమస్యను పరిష్కరించడంలో నూతన సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, రైతు భరోసా, రాయితీపై 500 కే గ్యాస్, గృహ జ్యోతి పథకాలతో పాటు మరెన్నో పథకాలను అమలుచేసి ప్రజల మన్ననలు పొందుతూ దేశంలోనే ప్రజా ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. వైద్య రంగాలకు, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని, నియోజకవర్గంలోని పేద ప్రజలకు కార్పొరట్ స్థాయిలో వైద్యం అందించేందుకు పాలకుర్తి

, తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలను అందించడంలో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అర్హులందరికీ లబ్ధి జరుగుతుందని, పేద ప్రజల కల సహకారం అయ విధంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం లో 5 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు బిల్లులు తీసుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతారావు, పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ మారం శ్రీనివాస్, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి పట్టణ అధ్యక్షులు కమ్మగాని నాగన్న గౌడ్, జిల్లా నాయకులు బొమ్మగానిభాస్కర్ గౌడ్, పెనుగొండ రమేష్, గడ్డం యాక సోమయ్య, జలగం కుమార్, అనుబంధ సంఘాల అధ్యక్షులు బండిపెళ్లి మనమ్మ, లావుడియా భాస్కర్, గాదపాక భాస్కర్, ఐలేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad