Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

- Advertisement -

కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ యాదవ్..
నవతెలంగాణ – వెల్దండ
రైతాంగ సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని  కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యక్రమంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం రైతాంగ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రహించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి , మండల వ్యవసాయ అధికారి శోభా రాణి, సింగిల్ విండో డైరెక్టర్ లు నాగులు నాయక్ , వెంకటయ్య గౌడ్, ఏ ఎం సి డైరెక్టర్ కృష్ణ, పురుషోత్తం, పుల్లయ్య, నిజాముద్దీన్, బద్రి యాదవ్, కోస్టాల్ , శ్రీశైలం , సిబ్బంది శ్రీనివాసులు , వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -