Wednesday, January 7, 2026
E-PAPER
Homeజాతీయంహెచ్‌ఎఎల్‌లో కార్మికుల తొలగింపు నిలిపేయాలి..

హెచ్‌ఎఎల్‌లో కార్మికుల తొలగింపు నిలిపేయాలి..

- Advertisement -

రక్షణ మంత్రికి సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం లేఖ

న్యూఢిల్లీ : బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)లో 1050 మంది కార్మికుల తొలగింపు చర్యను ఉపసంహరించుకో వాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిఐటియూ ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సోమవారం ఒక లేఖ రాశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని, కార్మికుల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోరారు. బెంగళూరు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌ )లో పని చేస్తున్న సుమారు 1050 మంది (టెన్యూర్‌ బేస్డ్‌) కార్మికులు 2016 నుండి వివిధ దశల్లో నియామించారు. అయితే పాత కార్మికులను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోవాలని యాజమాన్యం సిద్ధమయింది.

హెచ్‌ఎఎల్‌ యాజమాన్యం 2015లో ప్రవేశపెట్టిన టెన్యూర్‌ బేస్డ్‌ ఎంప్లాయిమెంట్‌ (నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ఉపాధి) పథకం కింద ఈ కార్మికులను నియమించుకుంది. వీరంతా రాత పరీక్షలు, వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికయ్యారని, గత 8 నుండి 10 ఏళ్లుగా శాశ్వత కార్మికులతో సమానంగా కీలకమైన సాంకేతిక పనుల్లో నిమగమై ఉన్నారని ఎలమారం కరీం తన లేఖలో పేర్కొన్నారు. అయితే గత సంవత్సరం డిసెంబర్‌ 9, 12 తేదీల్లో జారీ చేసిన సర్క్యులర్ల ప్రకారం, ప్రస్తుతం ఉన్న కార్మికులను తొలగించి, వారి స్థానంలో మళ్లీ కొత్తగా టెన్యూర్‌ బేస్డ్‌ కార్మికులను నియమించుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. ఇది చట్టవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16, 21 , 23లను ఉల్లంఘిం చడమేనని ఆయన విమర్శించారు. ఒక సెట్‌ టెన్యూర్‌ కార్మికులను తొలగించి, వారి స్థానంలో మరో సెట్‌ టెన్యూర్‌ కార్మికులను నియమించడం చట్టం అనుమతించదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -