సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రజా సమస్యలు వెలికి తీయడంలో నవతెలంగాణ ముందువరుసలో ఉంటుంది. అంకితభావంతో పనిచేస్తున్న విలేకరులు, సిబ్బంది ఈ పత్రికకు ఆయువు పట్టని, సమాజం పట్ల గౌరవం, ప్రజల పట్ల నిబద్ధతతో పని చేస్తున్న పత్రిక నవతెలంగాణ అని సీఐటీయూ జిల్లా కార్యాదర్శి నూర్జహాన్ అన్నారు. ప్రజాకోణంలో వార్తలు, విశ్లేషణలు అందిస్తూ ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజంతో నవతెలంగాణ పాఠకులకు చేరువవుతోందని తెలిపారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా అకుంఠిత దీక్షతో సమజా హితమే ధ్యేయంగా పోరాడుతోందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ శ్రమ జీవులకు శక్తిగా నవతెలంగాణ పత్రిక కొనసాగుతోందన్నారు. సమస్య ఏదైనా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బాధ్యతగా భావించి, వార్త కథనాలను అందిస్తోందని తెలిపారు. పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రమ జీవుల శక్తి నవతెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES