Thursday, March 26, 2026
E-PAPER
Homeసినిమాగొప్ప యోధుడి కథ

గొప్ప యోధుడి కథ

- Advertisement -

పీపీ మూవీ మేకర్స్‌, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై టి. మల్లేశ్వరుడు, అంతటి నరేష్‌ కుమార్‌, అంతటి రాజేష్‌ కుమార్‌ నిర్మాతలుగా నిర్మితమవుతున్న చిత్రం ‘బర్బరీకుడు’.
ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. మహా భారత కురుక్షేత్ర యుద్ధంలోని ఒక యోధుడి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి శివ శక్తి దత్త శిష్యుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అలాగే గీత రచయితగా పనిచేసిన శివఝాన్సిరేగాల ఈ చిత్రంతో దర్శకుడుగా అరంగేట్రం చేస్తున్నారు.

తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టేందుకు భారతీయ అతిపెద్ద ఇతిహాసం మహాభారతంలోని ఒక యోధుడి కథను తెరకెక్కించబోతున్నామని, ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారు. చాలామందికి బర్బరీకుడు చరిత్ర గురించి తక్కువగా తెలుసని, ఈ చిత్రంతో ఆయన ఎంతటి గొప్పయోధుడో అందరికీ తెలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన రామ్‌లక్ష్మణ్‌ల శిష్యుడు, స్టంట్‌ మాస్టర్‌ బద్రి మాస్టర్‌ అల్లుడు అయినా కృష్ణ భారత ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.

అయనతో పాటు అద్భుతమైన వాయిస్‌తో ఒప్పించి, తెరపై విలనుగా మెప్పించిన రవిశంకర్‌ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. సమ్మెట గాంధీ, జబర్దస్త్‌ చిట్టిబాబు, ఆనంద్‌ భారతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిగ్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : అనిల్‌ రెడ్డి, సంగీత దర్శకుడు: జీఎమ్‌ సతీష్‌, సినిమాటోగ్రాఫర్‌: శ్యామ్‌ కే నాయుడు, ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, లిరిసిస్ట్‌ : మద్దెల నారాయణ, శివఝాన్సిరేగాల, స్టంట్స్‌ : రామ్‌-లక్ష్మణ్‌, కొరియోగ్రాఫర్‌: భాను మాస్టర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -