భిన్న పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం’సరస్వతి’. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈనెల 6న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత పూజా శరత్ కుమార్ మీడియాతో సంభాషించారు.
-‘సరస్వతి’ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్న వన్ ప్యాక్డ్ పటాక. రెండు గంటల సినిమాని ఎంత గ్రిప్పింగ్‌గా చేయాలో అంత అద్భుతంగా తీర్చిదిద్దాం.
-ఇదొక క్రైమ్ థ్రిల్లర్. చాలా మంచి సోషల్ మెసేజ్ ఉంది. ఈ ట్రైలర్‌లో ప్రతి అమ్మాయి సరస్వతి లాగా ఉండదు సమయం వస్తే కాళీలా మారుతుంది అనే ఒక డైలాగ్ ఉంది. ఈ కథ వెనుక ఉన్న ఆలోచన అదే. ఒక స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ ఇందులో చూస్తారు. చాలా బలమైన కథ ఇది. వరలక్ష్మీ చాలా పర్సనల్‌గా కనెక్ట్ అయిన కథ.
-ఈ కథని ఈటీవీ విన్ బాపినీడుకి చెప్పాం. వారికి చాలా నచ్చింది. మేమే చేస్తామని చెప్పారు. అలాగే బన్నీ వాసుకి కంటెంట్ చాలా నచ్చి. రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. హీరో బాలకృష్ణకి కూడా ట్రైలర్ చాలా నచ్చింది. ఆయన విజువల్స్, డైలాగ్స్‌ని చాలా ఎంజాయ్ చేశారు.
-ప్రియమణి క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ రివీల్ చేయకూడదు. ప్రకాష్ రాజ్‌తో పాటు ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కథలో కీలకంగా ఉంటాయి. ఇందులో కోర్ట్ సీన్స్ చాలా ఇంపార్టెంట్. దాదాపు 7 నిమిషాల సింగిల్ షాట్ ఒకటి ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
-తమన్ మ్యూజిక్ విన్న తర్వాత మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. ఈనెల 5న ఒక ప్రీమియర్ అనుకుంటున్నాం.
శక్తివంతమైన మహిళ కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



