Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లేబర్ కోడ్ లను రద్దు చేసేంతవరకు పోరాటం

లేబర్ కోడ్ లను రద్దు చేసేంతవరకు పోరాటం

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి, కార్మికులకు మరణ శాసనమైన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసేంతవరకు పోరాటం నిర్వహిస్తాం అని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , సిఐటియు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు అన్నారు. గురువారం సిఐటియు, ఏఐటియుసి అనుబంధ కార్మిక సంఘాలతో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడంతో వందలాది మంది కార్మికులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం 2025  తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని విద్యుత్తు సవరణ , 100 రోజుల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి విబి జీ రామ్  పేరు మార్చడం, విత్తన సవరణ బిల్లు ఎల్ఐసి లో 100 శాతం  విదేశీ పెట్టబడును అనుమతించడం దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నంత వర్గాల కొమ్ముకాస్తూ ఆదానికి అంబానికి దేశ సంపద అప్పచెబుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానిపై ఉద్యమాలు శరణ్యం అన్నారు. రాబోవు రోజుల్లో వామపక్ష కార్మిక సంఘాలు ఐక్యతతో పోరాటం చేయాలని  అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మాజీ మండల కార్యదర్శి యాసరాని శ్రీను, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను ,జిపి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు  పెరుమాండ్ల రాజు, రెడ్డి మల్ల యాదగిరి , ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య , తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు బండమీది యాదయ్య, ఏఐటీయూసీ. మండల అధ్యక్షులు దుబ్బ వెంకన్న.  భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పందుల చిన్న నరసింహ, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, అంగన్వాడి మండల అధ్యక్షురాలు దాసరి అన్నపూర్ణ, బజారు అమాలి కార్మిక సంఘం నాయకులు చిరంజీవి, మిల్లు హమాలి కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వర్రె ముత్తయ్య, బొల్లం రాములు, చందపాక యాదయ్య, అంగన్వాడి టీచర్ వర్కర్స్ పారిజాత, శంకర్, బుల్లు సైదులు, హుస్సేన్ వెంకన్న, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -