Wednesday, March 4, 2026
E-PAPER
Homeక్రైమ్అన్నను చంపిన తమ్ముడు..

అన్నను చంపిన తమ్ముడు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సొంత అన్ననే తమ్ముడు హత్య చేశాడు. పోగుల ఆగయ్య నగర్‌లో మంగళవారం రాత్రి జరిగింది. అన్న రాజు రోజు మద్యం సేవించి అందరితో గొడవ పడుతుండే వాడని, ఈ తగాదాలు పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ్ముడు గురుస్వామి ఇటుకతో తలపై కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -