వదంతులతో ప్రజలు ఆందోళన పడొద్దు
బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలు, వదంతులతో ఆందోళన చెందొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం శాసనమండలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి గ్యాస్, పెట్రోల్ సరఫరాలపై సమీక్షించారు. రోజువారీగా కొనుగోలు చేసే దాని కంటే, ఎక్కువగా కొని నిల్వ చేయొద్దని వాహనదారులకు సూచించారు. బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదాదారునికి కూడా పెట్రోల్, గ్యాస్ దొరుకుతుందనే భరోసా కల్పించాలని అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు రెగ్యులర్‌గా ప్రెస్ బ్రీఫింగ్స్ ఇవ్వాలని సూచించారు. వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో రోజు వారి డిమాండ్ ఒక్కసారిగా 25శాతం పెరిగిందని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.
పెరిగిన డిమాండ్ రోజువారీ సగటున పోల్చిచూసినపుడు కుడా ఎక్కడా అంతరాయం కలుగకుండా అదనంగా 22 శాతం నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే కొన్ని పెట్రోలు బంక్‌లకు నిర్ణిత సమయానికి ట్యంకర్లు చెరుకోకపోవడంతో ఆయా బంక్‌ల్లో నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇందన నిల్వలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయనీ, సరఫరాలో అంతరాయం ఉండదని వివరించారు. కొరత ఉందనే పుకార్లను సాకుగా చేసుకుని బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను భట్టి ఆదేశించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పోలీసు కమిషనర్లు సజ్జనార్, సుధీర్ బాబు, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్‌కు కొరత లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



