కొందరు ప్రయాణ సమయంలో వికారం, తల తిరగడం, చెమటలు పట్టడం, వాంతులు, అసౌకర్యంతో బాధపడుతుంటారు. మీ లోపలి చెవి సెన్సింగ్ కదలిక, మీ కళ్ళు చూసే వాటి మధ్య డిస్‌కనెక్ట్ అయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ సమస్య సాధారణంగా బస్సు, కారు, పడవ, విమానం లేదా ఇతర కదిలే వాహనాల్లో ప్రయా ణిస్తున్నప్పుడు వస్తుంది. అయితే కొన్ని ఆహారా లకు దూరంగా ఉండటం, తేలికపాటి భోజనం తినడం ప్రయాణ సమయంలో అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం..
వేయించిన ఆహారాలు: ఈ ఆహారాలు జీర్ణం కావడం కష్టం. వికారం సమస్యను పెంచుతుంది. బర్గర్లు, ఫ్రైలు, వేయించిన చిరుతిళ్లు ఎక్కువసేపు కడుపులో ఉండి ప్రయాణాల్లో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేయడానికి ప్రయాణానికి ముందు, తర్వాత తేలికపాటి, నూనె లేని భోజనం తినండి.
మసాలా ఆహారాలు: స్పైసీ ఫుడ్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. వికారం లక్షణాలను పెంచుతుంది. దీన్ని నివారించడానికి, ప్రయాణానికి ముందు గ్రేవీ, మిరపకాయ, వేడి సాస్‌ల వంటి మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి.
కెఫిన్ పానీయాలు: కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ శరీరాన్ని నిర్జలీకరణం చేస్తాయి. నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. అదనంగా, కెఫిన్ కడుపు ఆమ్లతను పెంచుతుంది. ఇది వికారం కలిగిస్తుంది.
సోడా డ్రింక్స్: సోడాలు, శీతల పానీయాలు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి. ఇది వికారం, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండటానికి, జీర్ణ సమస్యలను నివారించడానికి నీరు లేదా హెర్బల్ టీలు తాగడం ఉత్తమం.
షుగర్ ఫుడ్స్: మిఠాయిలు, కేకులు, పంచదార చిరుతిళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇది మైకం, వికారం కలిగిస్తుంది. ప్రయాణంలో గింజలు లేదా తణధాన్యాలు వంటి తక్కువ చక్కెర స్నాక్స్ ఎంచుకోండి.
జర్నీలో ఈ జాగ్రత్తలు…
- Advertisement -
- Advertisement -



