కళ్ళారా చూడు భూతద్దాలు తగిలించుకో
ఓ పవిత్ర క్రతువులో నువ్వు భాగస్వామివీ
తొట్రుపాటు పడతావేందీ స్వామీ..
ప్రలోభాల పాయసం తాగావా….
సరళరేఖ లేవో వక్రరేఖ లేవో
గమనించలేని దూరద ష్టి లోపించిందా..
వేలుపై సిరాచుక్క వేగుచుక్కరా బాబారు
ఏం చూస్తున్నావ్ కళ్ళప్పగించి
ప్రజాస్వామ్య ముఖచిత్రం పరిహాసమవుతోంది
చీము నెత్తురు వుంటే నిఖార్సుగా నిలబడు
నిటారైన వెన్నుపూసల్ని నువ్వే నిర్మించుకో
వాళ్ళంతే పీఠం కోసం కొత్త పాఠం చెబుతారు
రాజకీయ ఘస్మరులు గంట కొడుతున్నారు
తానా తందానంటూ భజన చేయకురోరు
డబ్బు సంచుల గబ్బు వ్యూహం పన్నుతున్నారు
లౌకిక వ్యవస్థ నిండారా కునారిల్లుతోంది
మతోన్మాదం చాపకింద నీరవుతోంది
నీ టెలీఫోన్ తీగలపై ఇంకెవడో నిఘా పెట్టాడు
నిన్ను నగంగా బజారులో నిలబెడుతున్నాడు
ట్రాప్…ట్రాప్..అంతా వాడి ఉచ్చులో
నేటి ఎన్ని కలలో ఎన్ని కళలో…
జండాలు అజండాలు అవనతం అవుతున్నాయి
పదవులు వేలం పాటలవుతున్నాయి
ఓటరూ జరభద్రం నువ్వే షఉటరూ..
అద శ్య ప్రాకారాల వెనుక అలవికాని ఘోరాలు
నీ వెలుతురు కళ్ల మధ్యే చీకటి కత్తులు
కప్ప గంతులు మారే కండువాలపై నజర్ పెట్టు
సమ సమాజ స్థాపనలేవీ సామ్యవాద ధోరణులేవీ
ఘనీభవిస్తున్న నీ గుండెను దివుటు చేసుకో
లిక్కరు నీళ్ళు నీపై చల్లి చుక్కలు చూపిస్తుంట్రి
శవాలను పీక్కుతినే రాబంధులు
శవరాజకీయాలు చేసే గండ భేరుండాలు
విపణి వీధుల్లో విహరిస్తున్నాయి విస్తుపోకు
కాస్తైనా నీ అగ్ని చక్షువుల్ని మండించు
సామాన్యుడి స్వప్నచ్చాత్రాల క్రింద
పేక మేడల్ని నిర్మిస్తున్న వాణి? పసిగట్టు
ఆపద్ధర్మ వాగ్దానాలు మెండుగా కేకలేస్తున్నాయి
నిజం అబద్ధాల మధ్య వ్యత్యాసం తెలుసుకో..
సోదరా.. లోకకళ్యాణ గీతికకు పీఠికలు రాయి
గ్రామ అభ్యున్నతికి నడుం కట్టి అడుగేయి
మాయదారి విందులకూ చిందులేయకూ
నీ హక్కుల్ని అన్యాక్రాంతం కానివ్వకూ
ఓరు.. ఓటరూ నేనూ అటేపే వస్తున్నా
సిద్ధాంతంపై నిలబడ్డ నేతకు ఎర్ర తివాచీ పరువాలి
అక్కడ ఏవో సమాధులు కనిపిస్తున్నాయి
మహామహుల స్మ తి వాకిళ్ళు కావచ్చు
పుష్పగుఛం పెట్టి క్షణం మౌనం వహించి రావాలి
ఇక్కడ ఏవో స్వార్ధపు గోడలు కనిపిస్తున్నాయి
మహా మోసాల మాటల గూళ్లు కావచ్చు
నా ఓటు వేసి వాటిని కూల్చి రావాలి…!
డా.కటుకోఝ్వల రమేష్, 9949083327



