నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం హనుమాన్ ట్రైనింగ్ కి చెందిన తోటకూరి శివాని 18 సంవత్సరాల లోపు బాలికల 1000 మీటర్ల విభాగంలో తృతీయ స్థానం సాధించింది. ఇండియన్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 16న ప్రారంభమైన సౌత్ జోన్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో రెండవ రోజు పోటీల్లో భాగంగా తోటకూరి శివాని ఈ విజయం సాధించినట్టు నిర్వహకులు తెలిపారు. కాగా తృతీయ స్థానం సాధించిన తోటకూరి శివానిని తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్టాంన్లీ జోన్స్, ప్రధాన కార్యదర్శి కే. సారంగపాణి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోతoశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజయ అభినందించారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అథ్లెటిక్స్ కోచ్ కోనేటి గోపాల్ తెలిపారు.



