నవతెలంగాణ ఆత్మకూర్
ఆత్మకూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం కంపౌండ్ వాల్ పనులను, కోర్ట్ సమీపం వరకు జరిగే సీసీ రోడ్డు పనులను గురువారం మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా, డిసిసి జిల్లా కార్యదర్శి తులసి రాజ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వర్, పరిశీలించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం డి రహమతుల్లా, మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ఆత్మకూరు పట్టణానికి దశలవారికి అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోట్ల తిరుపతి, కో ఆప్షన్ సభ్యులు జహంగీర్ సౌజన్య గంగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి వెంకట రాములు, అజ్మత్, గడ్డం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు



