Monday, June 22, 2026
E-PAPER
Homeక్రైమ్గుంటూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

గుంటూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో విద్యార్థులు తుపాకుల గోపి, రాయల భరత్‌, జమీర్‌ అహ్మద్‌ ఏడో తరగతి చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వెళ్లిన ముగ్గురూ.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అదృశ్యమైన విద్యార్థులు ఢిల్లీలో ఉన్నారనే సమాచారంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -