Monday, June 22, 2026
E-PAPER
Homeక్రైమ్నల్లగొండలో విషాదం..ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య..!

నల్లగొండలో విషాదం..ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నల్లగొండ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని సాగర్‌ రోడ్డు తెలంగాణ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగు రోజుల క్రితమే వారు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇద్దరు దంపతులను ఎండీ సుల్తాన్‌, హసీనాగా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. పట్టణంలోని ప్రకాశం బజార్‌లో సుల్తాన్‌ బ్యాగుల వ్యాపారం చేస్తుండగా.. హసీనా ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -