Monday, July 13, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రేపు తెలంగాణలో పాఠశాలల బంద్..!

రేపు తెలంగాణలో పాఠశాలల బంద్..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని, దీనికి నిరసనగా రేపు (మంగళవారం) రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్‌కు ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పిలుపునిచ్చారు. రేషనలైజేషన్ పేరుతో 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సీఎం ప్రయివేటు విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యాహక్కు చట్టాన్ని అటకెక్కించిందని, యూనిఫామ్స్, మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -