నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామం లో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం పున:ప్రతిష్టన కార్యక్రమం అంగరంగావైభవంగా నిర్వహించారు. గత రెండు నెలల క్రితం ఆలయంలోని ధ్వజ స్థంభం విరగడంతొ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతమ ధ్వజ స్థంభంతొ పాటు ఆలయంలోని విగ్రవాలను పునరప్రతిష్టంచడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందన్నారు. సోమవారం మొదటి రోజూలో భాగంగా హోమం జరిపించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోమల రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ బొమ్మ రజిత రమేష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు నియమనిష్టలతో హాసజరైయ్యారు.
వైభవంగా ఆంజనేయుడి విగ్రహ పున:ప్రతిష్టాపన
- Advertisement -
- Advertisement -



