Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యూనివర్సిటీ ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..

యూనివర్సిటీ ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు గోపిశెట్టికి  తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శిల్పారామం లో జరిగిన  గురుపూజోత్సవ కార్యక్రమానికి  ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ  డాక్టర్ యోగితా రానా అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా, ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, శాసనమండలి సభ్యులు  వివిధ యూనివర్సిటీల వైస్  ఛాన్సలర్ లు అతిథులుగా హాజరై ఉపాధ్యాయ దినోత్సవం ప్రాధాన్యత గురించి  ప్రసంగించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ నుండి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు గోపిశెట్టిని శాలువా, మెమొంటో పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ప్రోత్సాహకంగా నగదు పారితోషకం రూ.10 వేలు అందుకున్నారు. ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి 28 సంవత్సరాల బోధన, పరిశోధనా అనుభవం కలిగినారు డీన్ & హెడ్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అకడేమిక్ పదవులతో పాటు ఎగ్జామినేషన్స్ విభాగంలో అడిషనల్ కంట్రోలర్గా, యూనివర్సిటీ హాస్టల్స్  ప్రిన్సిపాల్ గా  అడ్మినిస్ట్రేటివ్ పదవులలో పనిచేశారు. ప్రొఫెసర్ రాంబాబు అనేక జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు మరియు వర్క్ షాపులను నిర్వహించారు. ప్రొఫెసర్ రాంబాబు  పర్యవేక్షణలో నేటి వరకు. 13 మంది అభ్యర్థులకు పీహెచ్డీ  డిగ్రీలు ప్రదానం చేశారు. ప్రస్తుతం 08 మంది పీహెచ్డీ  అభ్యర్థులు తమ పరిశోధనను  రాంబాబు పర్యవేక్షణలో కొనసాగిస్తున్నారు.

రాంబాబు   అండర్-గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఉద్దేశించిన అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీస్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ మరియు టాక్సేషన్పై 15 పుస్తకాలను రచించారు. ఇదే కాకుండా పరిశోధన ప్రచురణలలో ప్రసిద్ధ జాతీయ,  అంతర్జాతీయ జర్నల్స్లో సుమారు 85 పరిశోధనా వ్యాసాలు ఉన్నాయి.అతను 31 జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు హాజరయ్యారు.వివిధ ప్రోగ్రామ్ లో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్పై విస్తృత ఉపన్యాసం చేసినారు.

 వివిధ సంస్థలు, యూనివర్సిటీ లు  నిర్వహించే వివిధ రకాల రిఫ్రెషర్ కోర్సులు, ఓరియంటేషన్ ప్రోగ్రామ్లకు అతను రిసోర్స్ పర్సన్గా కూడా ఆహ్వానించబడ్డారు.అత్యంత పేదరికంలో  పుట్టిన ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి  నిరంతరం కష్టపడుతూ, పారదర్శకంగా పరిపాలన కొనసాగిస్తూ, ఆచరణాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఈ అవార్డు వచ్చిన సందర్భంగా రాంబాబు గోపిశెట్టి కి ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్, కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్, యూజీసీ డైరెక్టర్ డాక్టర్ ఆంజనేయులు కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల, తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్  అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ బాబు ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి డాక్టర్ అడికే నాగరాజు, పాత నాగరాజు, డాక్టర్ జమీల్ అహ్మద్ అన్ని శాఖల  విభాగాధిపతులు  టీచింగ్ నాన్ టీచింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ అవార్డు పొందిన సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్  ప్రొఫెసర్ టి యాదగిరిరావుకు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad