Saturday, May 23, 2026
E-PAPER
Homeజాతీయంభార‌త్ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి

భార‌త్ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన కోల్‌కత్తాలో ల్యాండ్‌ అయ్యారు. ఇరుదేశాల వాణిజ్య ఒప్పందాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అదే విధంగా విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై అనేక అంశాలపై చర్చలు జరుపుతారు. మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొంటారు. రూబియో పర్యటన సందర్భంగా కోల్‌కతా, జైపూర్, ఆగ్రాలను కూడా సందర్శించే అవకాశముందని సమాచారం. ప్రధాని మోదీని కూడా ఆయన కలుసుకుంటారు. ‘భారత్‌తో మాకు చాలా పనుంది. భారత్‌ మాకు మంచి మిత్ర దేశం, భాగస్వామి కూడా. నాది చాలా ముఖ్యమైన ట్రిప్‌’అంటూ భారత్‌ పర్యటనపై శుక్రవారం రూబియో వ్యాఖ్యానించడం గమనార్హం. పశ్చిమాసియాలో పరిణామాలు, ఇంధన సరఫరాలపై ప్రభావంతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, క్రిటికల్‌ టెక్నాలజీ, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశముందని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -