Saturday, May 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల

అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. మురళీకిశోర్‌ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌లో అఖిల్‌ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ‘మనోడు వస్తున్నాడు..’, ‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా’ అంటూ అఖిల్‌ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌తో రొమాన్స్‌, ‘యాడికమ్మీ పోతుండావు.. ఈరోజు అటో ఇటో తేల్చేద్దామూ’ అంటూ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడం బాగుంది. చివర్లో యాక్షన్‌ సీన్లు సినిమాపై అంచనాలను పెంచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -