Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాన్యుడికి కూర "గాయాలు"

సామాన్యుడికి కూర “గాయాలు”

- Advertisement -

పెరిగిన ధరలతో పేదోడికి భారం
నవతెలంగాణ – మల్హర్ రావు

రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్య పేదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత రెండుమూడు రోజులుగా నుంచి నిత్యావసరమైన టమాటా, పచ్చిమిర్చి ధరలు చుక్కలన్నంటాయి. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు పోషకాహారం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నాయి. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, రవాణా ఖర్చుల పెరుగుదల, నిల్వ సదుపాయాల కొరత తదితర అనేక కారణాలతో రేట్లకు రెక్కలు వస్తున్నాయి. స్థానిక రైతులు పండించడపోవడంతో వారసంతలకు సరఫరా తగ్గుతుంది. ఆగస్టు వరకు కూరగాయల ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

కూరగాయల ధరలు ఇలా..

టమాటా – కిలో రూ.60
పచ్చిమిర్చి- కిలో రూ.100-120
వంకాయ- కిలో రూ.80
చిక్కుడు – కిలో రూ.120
గోరుచిక్కుడు – కిలో రూ.80
గోబీ – కిలో రూ.60-80
ఆకుగోబీ – కిలో రూ.80
బెండకాయ – కిలో రూ.80
కాకర – కిలో రూ.80.
మునగ – కిలో రూ.80
అలసంద – కిలో రూ.120
దొండకాయ కిలో రూ.80
బీరకాయ – కిలో రూ.100-120.
దొండకాయ – కిలో రూ.80
అల్లం – కిలో రూ.100-120
వెల్లుల్లి – కిలో రూ.150
ఆలుగడ్డ – కిలో రూ.30-40
ఉల్లిగడ్డ – కిలో రూ.20-30

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -