- Advertisement -
నవతెలంగాణ – తుంగతుర్తి
ఉదయం 10 గంటలకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో,ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ తుంగతుర్తి నందు, సర్కిల్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన ఏడు ద్విచక్ర వాహనాలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు తుంగతుర్తి ఎక్సైజ్ సీఐ రజిత ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహస్తున్నామని తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు స్టేషన్ దగ్గరకు వచ్చి, వాహనాలను తనిఖీ చేసుకొని, ధరావతు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలంలో వాహనం దక్కని ఎడల ధరావతు తిరిగి వాపసు ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -