- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే. తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు. తెలంగాణ గడ్డ ముమ్మాటికీ మా జాగీరే. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం’’ అని వెన్నెల పేర్కొన్నారు.
‘‘ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్‌కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు’’ అని వెన్నెల అన్నారు.
- Advertisement -



