- Advertisement -
నవతెలంగాణ – సదాశివపేట
సదాశివపేట మున్సిపల్ నూతన వైస్ చైర్మన్‌గా ఎన్నికైన రేణుక చిరు శుక్రవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



