Tuesday, March 24, 2026
E-PAPER
Homeఆటలువింబుల్డన్‌లో వీడియో రివ్యూ

వింబుల్డన్‌లో వీడియో రివ్యూ

- Advertisement -

ఈ ఏడాది నుంచి అమల్లోకి కొత్త టెక్నాలజీ

లండన్‌ : ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌ వింబుల్డన్‌ సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో ముందంజలో నిలుస్తోంది. నిరుడు ఎలక్ట్రానిక్‌ లైన్‌ కాలింగ్‌ (ఈఎస్‌సీ) వ్యవస్థను ప్రవేశపెట్టిన ఆల్‌ ఇంగ్లాండ్‌ లాన్‌ టెన్నిస్‌ అండ్‌ రాకెట్‌ క్లబ్‌ (ఏఈఎస్‌టీసీ) నిర్వాహకులు ఈ ఏడాది వీడియో రివ్యూ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీడియో రివ్యూ టెక్నాలజితో ఆటగాళ్లు చైర్‌ అంపైర్‌ నిర్ణయాలను సవాల్‌ చేయవచ్చు. ఓ మ్యాచ్‌ లేదా సెట్‌లో ఎన్ని రివ్యూలు తీసుకునే అంశంపై ఎటువంటి పరిమితి విధించటం లేదు. వీడియో రివ్యూ టెక్నాలజితో ఆటగాళ్లు ఎలక్ట్రానిక్‌ లైన్‌ కాలింగ్‌ నిర్ణయాలను మాత్రం సవాల్‌ చేయడానికి లేదు. ఈ మేరకు వింబుల్డన్‌ నిర్వాహకులు సోమవారం వెల్లడించారు. జూన్‌ 29 నుంచి 2026 వింబుల్డన్‌ ఆరంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -