ఇంకా ఎంత కాలం ?

ఎప్పుడో నాటిన కుల మొక్కలకు
నెత్తురు పోసి మరీ పెంచుతూ
వాటి గింజలను సమాజంలోకి విసిరేస్తున్నారు

తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్టు
ఆ గింజలు మహావృక్షాలై
విషవాయువుని చిమ్ముతున్నయి
వాటి ఊడలు దళితుల మెడలకు ఉరి తాల్లై
ఎన్నో ప్రాణాలను బలితీసుకుంటునై

20వ శతాబ్దంలో కూడా
మనుషులనింకా కులపిసాచి పట్టిపీడిస్తుంది
చెప్పులు చిపురికట్టతో కొట్టి దాన్ని ఎవరు వదిలిస్తరు
ఇయ్యల డాక్టర్లు హార్ట్‌ ట్రాన్స్‌ ప్లాంటేశన్‌ పేరుతో
గుండె తీసి గుండె పెడుతుర్రు
కానీ అన్ల ఇంత మానవత్వం ఎవరు నింపుతరు

హైదరాబాద్‌ మహానగరాన్ని కూడ
ఈ మహమారి వదలలేదు
ఇల్లు రెంటు కోసం వెళ్తే
కులం తక్కువ అని
మొకం మీదే తలుపులు ముతపడుతై

ఇటీవల జరిగిన యువకుడి హత్యకు కారణం
కులాంతర వివాహం అని తెలిసి
గుండె చెలిమి నిండుకుంది
నెత్తుట్టి మడుగులో మానవత్వం
ఊపిరాడక చచ్చిపడింది

కన్నతండ్రే కూతురి పుస్తెలను
యముడికి అప్పగించి
తెళ్లచీరను కానుకగా తెచ్చాడు
తిరాచుస్తే తాను ఆత్మహత్య చేసుకొని
చావు ఓడిలోకి చేరుకున్నడు
ఇప్పుడు గెలిచింది ఎవరు ఒడింది ఎవరు

కొత్తగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో
రోబొలకి ఆలోచనా శక్తి ఇస్తరంట
చూస్తుంటే వాటి తలలో కూడా
కులబీజం నాటి పంపెలా ఉన్నారు

టెక్నాలజీ ఎంత పెరిగినా
బూజుపట్టిన బుర్రలకు
ఈసమంత కూడ తెలివి రావట్లేదు

అంటరానితనం ఇంకా ఎంత కాలం
ఇక ఉర్కునేది లేదు
కులవ్యవస్థను అరికాళ్ళతో
అతాల పాతాలంలోకి తోక్కాల్సిందే

– ఆకాష్‌ మునిగాల, 8106390647

Spread the love