రక్త హీనతను ఇలా అధిగమించాలి

రక్తహీనత వున్నవారు త్వరగా అలసిపోతారు. కొంచెం దూరం నడవాలంటేనే ఆయాసం, రొప్పు వస్తాయి. ఎప్పుడూ నీరసంగా, ఒంట్లో ఓపిక లేనట్లు నిద్రపోవాలనిపిస్తుంది. వీటన్నింటిని అధిగమించాలంటే ఐరన్‌ బాగా వున్న ఆహారం తీసుకోవాలి. బీట్‌రూట్‌ రసం శరీరంలో రక్త స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. బచ్చలికూర, పుదీనా రసం తీసుకుంటే శరీరంలో రక్త కొరతను తీర్చుతుంది. దానిమ్మ రసంలో వుండే సి విటమిన్‌కి శరీరంలో రక్తాన్ని పెంచే గుణం వుంది. ఇంకా నిమ్మకాయలో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. నేరేడు కాయ, ఉసిరి రసాలను, క్యారెట్‌, పాలకూర రసం తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్‌ పరిమాణం పెంచుకోవచ్చు.

Spread the love