ప్రస్తుత జీవనశైలి, జీవిన విధానం వల్ల అధిక బరువుతో బాధపడేవారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. బరువు ఎక్కువగా వుండడం అతి పెద్ద సమస్య. ఎక్కువ బరువు వుండటం వల్ల చిన్న వయసులోనే ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
– పొట్ట భాగంలో అధిక మోతాదులో ఫ్యాట్ పేరుకుని వుండడం వల్ల చాలా చిన్న వయసులో మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి.
– అధిక మోతాదులో ఫ్యాటీ లివర్ వల్ల లివర్ చుట్టూ ఫ్యాట్ ‘పోర్టర్ హైపర్ టెన్షన్’కి దారితీయవచ్చు. అంతేకాకుండా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు తయారవుతాయి. గుండె సంభందిత వ్యాధులు చిన్న వయసులోనే వస్తాయి.
– బరువు తగ్గడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
– ఆహారంలో అధిక మోతాదులో ఫైబర్ (పీచు పదార్థాలు) చేర్చడం ద్వారా బరువు తగ్గొచ్చు.
– ఫైబర్ కూరగాయల్లో, పండ్లల్లో ఎక్కువగా వుంటుంది.
– ప్రతిరోజూ ఒక నియమంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందు సలాడ్ (కీరా, క్యారెట్, టమాట, ఉల్లి సలాడ్) తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ సలాడ్‌లో కొంచెం నిమ్మరసం, మిరియాల పొడి వేసుకుని తినాలి.
– సలాడ్ (ఫైబర్ ఆహారం) ముందుగా తిని, తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల అధిక కాలరీలు శరీరంలో చేరకుండా వుంటాయి.
– ఆహారంలో ఎక్కువ ఫైబర్ వుండేలా జాగ్రత్త తీసుకోవాలి. దీనివల్ల ఆహారంలో భాగంగా తీసుకున్న నీటిని ఫైబర్ శోషణ చేసుకుంటుంది. తద్వారా పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా బ్యాలెన్స్‌గా వుంటాయి.
– షుగర్ వ్యాధి వున్న వారి ఆహారంలో ఫైబర్ అత్యంత కీలక పాత్ర వహిస్తుంది.
ఉదా : కూరగాయలు, పండ్లు, ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువగా వుంటుంది. మిల్లెట్స్‌లో కూడా ఫైబర్ ఎక్కువగా వుంటుంది. జామ, బత్తాయి, పైనాపిల్, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లలో కూడా ఫైబర్ అధిక మోతాదులో వుంటుంది.
– పి.వాణి, 9959361180