- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. టీవీకే పార్టీకి కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో విజయ్ పార్టీ సంఖ్యా బలం 120కి చేరింది.
- Advertisement -



