- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. అన్నపై తమ్ముడు దాడి చేయగా.. అడ్డొచ్చిన వదిన తీవ్రగాయాలతో మృతిచెందారు. నల్లబెల్లి మండలం కొండాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అన్న మేరుగుర్తి రమేశ్‌పై తమ్ముడు సురేశ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వదిన స్వరూప (30) అడ్డు వచ్చింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్‌లో నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో స్వరూప మృతిచెందారు. గాయాలతో ఆస్పత్రిలో రమేశ్ చికిత్స పొందుతున్నాడు.
- Advertisement -