– మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య
– వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
యువత క్రీడల్లో రాణించడం ద్వారా గ్రామానికి మంచి పేరు తేవాలని కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. గురువారం మండలంలోని నాగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ కంపదండి అశోక్ ఆధ్వర్యంలో స్థానిక వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, గంగా వాటర్ ఫిల్టర్ యజమాని డాకూరి రాజేశ్వర్ ల సహకారంతో గ్రామ వాలీబాల్ క్రీడాకారులకు ఈ క్రీడా దుస్తులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలెపు నర్సయ్య మాట్లాడుతూ గ్రామానికి చెందిన యువత వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించడం ద్వారా గ్రామానికి పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. క్రీడల్లో రాణించే యువతకు తమ సహాయ సాగగా సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకొని యువత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. గ్రామానికి చెందిన యువత ఉన్నత శిఖరాలకు చేరుకుంటే అది గ్రామంతో పాటు తమకెంతో గర్వకారణంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉల్లెంగుల శశిధర్, గ్రామ ప్రముఖులు పాలెపు రాజేశ్వర్, బసిరి అశోక్, నీలకంఠం, వాలీబాల్ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.



