Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గోశాల నిర్వహణకు సహకరిస్తాం 

గోశాల నిర్వహణకు సహకరిస్తాం 

- Advertisement -

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ 
సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 
నవతెలంగాణ – పాలకుర్తి

గోశాల నిర్వహణకు ఎస్టి కమిషన్ నుండి సహాయ సహకారాలు అందిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గల శ్రీ గౌరీ గోషాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ గోశాల నిర్వహణ ఇబ్బందికరంగా ఉందని, గోశాల పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులు అందాలని తెలిపారు. గోశాలలో 95 పశువులను పేద రైతులకు అందించారని విచారణలు తేలిందని తెలిపారు. అనారోగ్యంతో ఇరవై ఒక్క పశువులు, దూడలు మృత్యువాత పడ్డాయని నిర్వాహకులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.

ఒప్పంద పత్రాలతో గిరిజన రైతులకు వ్యవసాయానికి, పెంచుకోవడానికి గోశాల నిర్వాహకులు అందించడం పట్ల అభినందించారు. గోశాల నిర్వహకులను ప్రోత్సహించాలి తప్ప అడ్డుపడరాదని, సేవ చేసే వారికి తోడ్పాటున అందించాలని సూచించారు. సేవ చేయాలి తప్ప సేవ చేసే వారిని అడ్డుకోకూడదని సూచించారు. ఎస్టి కమిషన్ ఆధ్వర్యంలో అండగా నిలుస్తామని అన్నారు. పశువులను కాపాడడంలో గిరిజనులు శ్రద్ధ చూపుతారని, పశువులు కాపాడుకునే వారికి గోశాల నుండి పశువులను అందించాలని సూచించారు. అనంతరం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణాహుతితో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొంగరి మహేందర్, మారం రవికుమార్, కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, దుంపల సంపత్, మచ్చ సునీల్, శంకర్ లతోపాటు ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మణ్, డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్, మతగజం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad