Wednesday, May 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్తడుస్తున్న మొక్కజొన్న, జొన్న సంచులు..రైతుల ధర్నా

తడుస్తున్న మొక్కజొన్న, జొన్న సంచులు..రైతుల ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – బజార్హత్నూర్: బజార్హత్నూర్ మండల కేంద్రంలో రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మెరుపు ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు చేసి వారం రోజులు గడిచినా సుమారు 7 వేల సంచులు ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లోనే ఉండి అకాల వర్షానికి తడుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు పంపించి లోడింగ్ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జొన్న పంటను ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని కోరారు. ఇప్పటికే కొనుగోలు చేసిన సుమారు 15 వేల జొన్న సంచులను వెంటనే లారీల్లో లోడ్ చేసి తరలించాలని, వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు డుబ్బుల చంద్రశేఖర్, దనాగరి రాములు, ప్రభాకర్, తోకల రాజన్న, అనుము సాయన్న, అగ్గునందు, ధనుంజయ్, ఫరీద్ ఖాన్, లక్కం శంకర్, సోం రామ్ రెడ్డి, లక్కం శ్రీనివాస్, గంట చిన్నయ్య, మారుతి, తడక శ్రీనివాస్, దనగరి పండరి, సుది వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -