కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలి: సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్
నవతెలంగాణ – దుబ్బాక
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లలో పనిచేస్తున్న పేషెంట్ కేర్, షానిటేషన్ స్వీపర్, సెక్యూరిటీ గార్డులు ఇలా పలు రకాల ఔట్ సోర్సింగ్ కార్మికులకు రూ.26 వేలు కనీస వేతనంగా చెల్లిస్తూ పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి. భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం దుబ్బాక లోని ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆసుపత్రి లో పనిచేస్తున్న పేషంట్ కేర్, శానిటేషన్ స్వీపర్, సెక్యూరిటీ గార్డుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం సూపరిండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ కి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్ మాట్లాడుతూ… జీవో నెంబర్ 60 ప్రకారం రూ. 15,600 కనీస వేతనం చెల్లించాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ కేవలం రూ.11 వేలు మాత్రమే చెల్లిస్తూ కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే కార్మికుల అకౌంట్లలో పీఎఫ్, ఈఎస్ఐ వాటాలు కూడా పూర్తిగా జమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరలకనుగుణంగా ప్రభుత్వం నెలకు రూ.26000 కనీస వేతనంగా చెల్లించాలని, యూనిఫార్మ్స్, షూస్, బెల్ట్ తదితర వాటిని ప్రభుత్వమే రెగ్యులర్ గా కార్మికులకు సప్లై చేస్తూ.. చట్టప్రకారంగా లేబర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల ప్రకారం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రభుత్వ హాలిడేస్ తో పాటు ఏడాదికి 12 రోజుల క్యాజువల్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేనియెడల సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, నాయకులు ఎండీ సాజిద్, హాస్పిటల్ కార్మికులు ఇందిర, లావణ్య, నవీన్, మైపాల్, భూదవ్వ, మహేశ్వరి, మల్లవ్వ, లక్ష్మి, కమల, ధనలక్ష్మి, శిరీష, గంగవ్వ, సువర్ణ, హారిక, సౌందర్య, బాల్ రాజు, సతీష్ పలువురు పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత ఏది..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES