- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీ యాకూబ్ పాషా కుమార్తె షేక్ అస్మా తపస్సు కి ఎంబిబిఎస్ సీటు వచ్చిన సందర్భంగా చదువు ఖర్చు కోసం గ్రామస్తులంతా కలిసి రూ.22వేలు జమ చేసి ఆ చెక్కును మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మాజీ జెడ్పిటిసి గోనే శ్రీనివాసరావు,బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, మంథని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పుట్టపాక శ్రీనివాస్, నాచారం మాజీ సర్పంచ్ కాసాని రామయ్య శ్రీశైలం, కుమ్మరి సది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



