Saturday, May 30, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్త్వరలో పీఎఫ్ ఖాతాదారులకు వాట్సప్ సేవలు ప్రారంభం

త్వరలో పీఎఫ్ ఖాతాదారులకు వాట్సప్ సేవలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలో వాట్సప్ ద్వారా ఖాతాదారులకు సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్, క్లెయిమ్ స్టేటస్, కేవైసీ అప్డేట్, ఫిర్యాదులు వంటి సేవలను సులువుగా పొందవచ్చు. యూఏఎన్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నుంచి నిర్దిష్ట నెంబర్‌కు ‘హాయ్’ అని మెస్సేజ్ చేస్తే చాలు. ఈ సేవలు వివిధ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంటాయి. దీనివల్ల పీఎఫ్ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గి, ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ఈ చాట్‌బాట్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -