నవతెలంగాణ – మద్నూర్ : ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఒక సామెత లాగా ఇక్కడే విధుల్లో చేరి ఇక్కడే పదవి విరమణ పొందిన హౌసింగ్ ఏఈ హనుమంత్ కు ప్రతి ఒక్కరూ ఆయన సేవల గురించి కొనియాడారు. మీలాంటి సేవలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులకు ఆదర్శంగా నిలవాలని పలువురు వక్తలు పదవి విరమణ వేడుకల్లో తెలియజేశారు. హౌసింగ్ ఏఈ హనుమంతు 1985లో మొట్టమొదటిసారిగా మద్నూర్ మండలంలో హౌసింగ్ శాఖలో విధుల్లో చేరారు ఆయన సుధీర్గా 40 సంవత్సరాల పదవి కాలంలో మొదట మద్నూర్ ఆ తర్వాత జుక్కల్, బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించినట్లు చివరిగా మళ్లీ మద్నూర్ మండలంలో నే పదవి విరమణ పొందారు.
ఆయన చేసిన కృషి మండలం జిల్లాలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మొదట మండలంగా నిలుస్తూ ఏఈకి ఉత్తమ విధుల పురస్కారాన్ని కలెక్టర్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఆయన పదవి విరమణ మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ పదవి విరమణ కార్యక్రమానికి మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని సర్పంచులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. హౌసింగ్ ఏఈ దంపతులకు ఘన సన్మానాలతో పాటు భోజన సదుపాయాలను సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్ మాధవరావు ఆ గ్రామ కార్యదర్శి గ్రామ ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఒక ఫోటోను బహూకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మీ సేవలు అమూల్యమైనవి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ ఎంపీడీవో రాణి, దొంగిలి మండల ఎంపీడీవో జగదీష్, ఎంపీ ఓ లక్ష్మీ నరసయ్య, హౌసింగ్ డిఇ, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశాయ్, ఆ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బచ్చావార్ లక్ష్మణ్, ఇరు మండలాల సర్పంచులు ఇరు మండలాల గ్రామ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



