Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుంతల బ్రిడ్జికి మరమ్మతులు జరిగేనా.?

గుంతల బ్రిడ్జికి మరమ్మతులు జరిగేనా.?

- Advertisement -

– కాకతీయ కాలువ బ్రిడ్జిపై నరకప్రాయంగా ప్రయాణం
– ప్రమాదాలకు ఆస్కారంగా కాకతీయ కాలువపై బ్రిడ్జి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి   
మండలంలోని ఉప్లూర్ గ్రామం నుంచి రాజరాజేశ్వరీ నగర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ వంతెనపైన ఏర్పడ్డ గుంతలు ప్రమాదాలకు ఆస్కారంగా మారాయి. కాకతీయ కాలువ వంతెన సమీపంలోనూ బీటి రోడ్డు దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఏండ్లుగా వాహనదారులు, ప్రజలు వంతెనపై గుంతల గుండానే ప్రయాణం సాగిస్తున్నారు. కాకతీయ కాల్వ వంతెన పై ఉన్న గుంతల గుండా వెళ్తుంటే వాహనాలు ఎక్కడ కాలువలో పడిపోతాయోనన్న భయం కలుగుతుంది. వాహనదారులు, ప్రజలు భయం భయంగా కాకతీయ కాలువ వంతెన పై గుండా తప్పనిసరి పరిస్థితిలో పయనాలు సాగిస్తున్నారు. అసలు ఇరుకుగా ఉన్న ఈ వంతెన, దానికి తోడు మొత్తంగా గుంతలతో నిండిపోయింది.

గుంతల్లో చేరిన వర్షపు నీటిలో నుండి వాహనాలు వెళ్తుంటే పక్కనుండే వాహనదారులపై బురద చిమ్ముతుంది. దీంతో ఈ వంతెన పై నుండి వెళ్లేందుకు వాహనదారులు, పంట పొలంలోకి కాలినడకన వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్లూర్ నుంచి రాజరాజేశ్వరి నగర్ కి వెళ్లాలంటే గుంతల రోడ్డుతో ప్రయాణం సాగించలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు నరకప్రాయంగా మారాయి. ఏండ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండడంతో ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాలువ వంతెనపై  పడ్డ పెద్ద పెద్ద గుంతలను పూడ్చి రోడ్డును బాగు చేయాలనే ధ్యాసే అధికారులకు లేకుండా పోయిందని ప్రజల విమర్శిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కాకతీయ కాలువ వంతెనపై పడ్డ గుంతలతో పాటు సమీపంలో పడ్డ గుంతలను పూడ్చి రోడ్డు బాగు చేయాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -