నవతెలంగాణ -చిన్నకోడూరు
మహిళల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందజేస్తానని మహిళ విభాగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఎదుగాని లహరి అన్నారు. శుక్రవారం జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు మీసం మహేందర్ తో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లో మహిళా విభాగం బలోపేతానికి కృషి చేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురావేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన లహరి మాట్లాడుతూ.. నా పై నమ్మకం తో నా నియామకానికి సహాకరించిన రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావ్, ఇంచార్జ్ మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి, మాజి ఎమ్మెల్యే మైనంపల్లీ హన్మంతరావు, నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు, వార్డ్ మెంబర్లు,తదితరులు పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధికి కృషి చేస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



