Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కుతుంది

మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కుతుంది

- Advertisement -

ప్రపంచంలోనే మన దేశం మహిళలకు ప్రత్యేక హోదా ఉంది.
ప్రతి రంగంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలనీ వక్తల పిలుపు
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ

మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రతిభను కనబరచాలని, మహిళలు అన్ని రంగాల్లో గౌరవింపబడాలి అని వక్తల పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, న్యాయవాది, పి పి నీరజ రెడ్డి, ప్రముఖ వైద్యురాలు బండారి సుజాత, అర్బన్ సిడిపిఓ సౌందర్య, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ స్పెషల్ స్కూల్ ప్రిన్సిపల్స్ జ్యోతి, రాజేశ్వరి, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత హాజరయ్యారు.

మొదట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రెస్ క్లబ్లో ఆనవాయితీగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళల పాత్ర లేనిదే సమాజ మనుగడ ముందుకు సాగదని పేర్కొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, జర్నలిజంలో కూడా తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని తెలిపారు. సమాజంలో మహిళలు, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పని చేస్తూ దూసుకుపోతున్నారన్నారు.

న్యాయవాది, పీపీ నీరజ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిజంలో కూడా మహిళలు విశేషంగా రాణిస్తు ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధులుగా నవ సమాజ స్థాపనకు పాటుపడుతు న్నారన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పలుచట్టాలపై అవగాహన కల్పించారు. ప్రముఖ వైద్యురాలు బండారి సుజాత మాట్లాడుతూ..

వృత్తితో పాటు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సక్రమంగా ఉంటుందన్నారు. నిత్యం వార్తలలో బిజీగా ఉంటూ కడప గడప ఇలాంటి కార్యక్రమాలు జరపడం బాగుందన్నారు. 

సిడిపిఓ సౌందర్య మాట్లాడుతూ..ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని దానికి అనుగుణంగా మహిళలు ఉన్నత చదువులు చదువుకొని శక్తివంతులై అన్ని రంగాల్లో ముందుకు రావాలని అన్నారు.

స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ స్పెషల్ స్కూల్స్ ప్రిన్సిపల్ జ్యోతి, రాజేశ్వరి మాట్లాడుతూ..మహిళలు ప్రస్తుత సమాజంలో ఎటువంటి అనుచివేత గురికాకుండా, మహిళా శక్తివంతులుగా, స్వయం శక్తి ఎదగడానికి ప్రభుత్వం కృషి చేయాలని, సంఘంలో ఎటువంటి అణచివేతకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినమైనా చట్టాలను తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు .అదేవిధంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యాచారాలు మానభంగాలను తిప్పి కొట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ప్రతి మహిళ చైతన్యమై అన్యాయాలపైన తిరుగుబాటు చేయాలని అప్పుడే మహిళ ఆత్మ గౌరవానికి విలువలు ఉంటాయని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులకు మహిళ జర్నలిస్టుల చే శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా మహిళా జర్నలిస్టులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. రాజు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు,సీనియర్ జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు తదితరు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -