Monday, July 14, 2025
E-PAPER
Homeదర్వాజప్రపంచపటం

ప్రపంచపటం

- Advertisement -

ప్రపంచంలోప్రతి చోటా సమస్యలున్నాయి వాటి విస్మరించలేము.
కొన్ని చోట్ల ఆకలితో, కొన్ని చోట్ల అవిద్యతో,
ఇంకొన్ని చోట్ల పేదరికంతో మరి కొన్ని చోట్ల అనారోగ్యంతో
నిత్యం పోరాటం జరుగుతూనే ఉంది.
కొన్ని చోట్ల తీవ్రరూపం దాల్చిన అవినీతితో,
ఇంకొన్ని చోట్ల ప్రాథమిక అవసరాలు
తీర్చలేని వ్యవస్థతో మరి కొన్ని చోట్ల ప్రాథమిక హక్కుల
కల్పించని ప్రభుత్వంతో
అలుపెరుగని పోరాటం జరుగుతూనే ఉంది.
కొన్ని చోట్ల పర్యావరణ పరిరక్షణ కోసం,
ఇంకొన్ని చోట్ల పునరావాస ప్రయత్నాల కోసం
మరి కొన్ని చోట్ల జాతి విద్వేషంతో రగులుకుంటే
ప్రజలు హింసతో పోరాటం చేస్తూనే ఉంది.
చిత్రంగా కొన్ని చోట్ల శాంతి కోసం కూడా
కొందరు యుద్ధంతోనే పోరాడుతున్నారు.
పోరాటాలతో నెత్తురంటిన వస్త్రంగా మారిన ప్రపంచపటాన్ని
మరోసారి మనసుతో గమనిద్దాం
ప్రతి దేశం విభిన్న భౌగోళిక ప్రాంతమే కాని
ప్రత్యర్థుల ఆవాసం కాదని గ్రహిద్దాం.
ఇప్పుడైనా ఇతరుల ఏడుపు వినడం నేర్చుకోవాలి
ఇకనైనా సానుభూతి పొందడం అలవర్చుకోవాలి.
ప్రపంచం అంటే కేవలం మన జీవితం మాత్రమే కాదు
మన జీవనాన్ని ప్రభవితం చేసే ప్రతిదీ.
చేయి చేయి కలిపి సంఘటితంగా, సమిష్టి శక్తితో
మార్పుకై ప్రయత్నం చేద్దాం
సమస్యలకు పరిష్కారాలను కనుగొందాం.
– కుడికాల వంశీధర్‌, 9885201600

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -