Magazines

నాటో సభ్యత్వం కావాలంటే....

16 నిమిషాల క్రితం

If you want NATO membership...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

ఉక్రెయిన్‌కు అమెరికా షరతు
కీవ్‌ : నాటో సభ్యత్వం కావాలంటే డాన్‌బాస్‌ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించు కోవాలని అమెరికా చర్చల ప్రతినిధులు ప్రతి పాదించారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అయితే జెలెన్‌స్కీ ప్రకటనను అమె రికా ధృవీకరించలేదు. అనేక ప్రతిపాదనలపై చర్చ జరుగుతుందని, కానీ తుది ఒప్పందానికి ఇరు పక్షాలు అంగీకరించాల్సి ఉంటుందని అమెరికా అధికారి ఒకరు బీబీసీకి తెలియ జేశారు. అమెరికా ప్రతినిధులు స్టీవ్‌ విట్‌కాఫ్‌, జేర్డ్‌ కుష్నర్‌ కొద్ది రోజుల క్రితం జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో విడివిడి గా సమావేశమయ్యారు. ఆ తర్వాత జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్య చేశారు. ఉక్రెయిన్‌ చాలా కాలం నుంచి నాటో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. అయితే అమెరికాతో పాటు కొన్ని దేశాలు గతంలో దీనిని వ్యతిరేకించాయి. తన సరిహద్దులో మరో నాటో సభ్యదేశం ఉండడం ఆమోదయోగ్యం కాదని రష్యా స్పష్టం చేసింది. 2022లో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా సేనలు పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌లో అధిక భాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆ భూభాగాన్ని వదులుకునే ప్రశ్నే లేదని జెలెన్‌స్కీ ఇప్పటికే తేల్చి చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్