న్యూఢిల్లీ : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ తన సతీమణి కేట్ మిడిల్టన్‌తో కలిసి సోమవారం నుంచి మూడు రోజుల పాటు ముంబైలో పర్యటిస్తారు. కేట్ 2024లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత రాజదంపతులు కలిసి చేస్తున్న మొదటి విదేశీ పర్యటన ఇదే. 2016 తర్వాత వీరిద్దరూ మన దేశానికి రావడం ఇది రెండోసారి. విలియమ్ సోమవారం ముంబై మెట్రోలో ప్రయాణిస్తారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను చూపే చర్చా కార్యక్రమంలో పాల్గంటారు. మంగళవారం ఎర్త్‌షాట్ ప్రైజ్ ఫైనలిస్టులను కలుస్తారు. చిల్డ్రన్స్ ఎర్త్‌షాట్ అవార్డుల వేడుకలో విలియమ్ దంపతులు పాల్గంటారు. బుధవారం హస్తకళలు-వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సంస్థను సందర్శిస్తారు. ప్రిన్సెస్ కేట్ ముంబైలోని ఓ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించి వైద్య సిబ్బందితో, తల్లులతో మాట్లాడతారు. ధర్మ ప్రొడక్షన్స్‌ను సందర్శించడంతో విలియమ్ దంపతుల భారత పర్యటన ముగుస్తుంది.
నేటి నుంచి ముంబైలో ప్రిన్స్ విలియమ్ దంపతుల పర్యటన
21 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)