నవతెలంగాణ-హైదరాబాద్: భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. ఇద్దరు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతేకాకుండా ఇద్దరి ఖాతాల్లోనూ ఒక్కో డీమెరిట్ పాయింట్ జత చేసింది. ఇద్దరూ ఐసీసీ ప్లేయర్స్ అండ్ ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించినట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా, కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌లో అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో జైస్వాల్ ఔటయ్యాడు. అనంతరం జైస్వాల్ పెవిలియన్‌కు వెళ్తుండగా.. ఫెర్నాండో ఏవో వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన యశస్వి.. ఫెర్నాండోతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
యశస్వి జైస్వాల్ మ్యాచ్ ఫీజులో కోత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



