ఎంఏ ఇక్బాల్ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు
నవతెలంగాణ-ఆలేర్ రూరల్
ప్రభుత్వం ఇస్తున్న చేయూత పెన్షన్లలో ఒంటరి మహిళలను గుర్తించి సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఎమ్మార్వోకి ప్రభుత్వం అప్పజెప్పినప్పటికీ, వారికి ఎంక్వయిరీ చేసి సర్టిఫికెట్లు అందించడంలో ఆలేరు రెవెన్యూ కార్యాలయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 15 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగి తాము రోజు సంపాదించుకునే కూలి కూడ నష్టపోతున్నామని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఒంటరి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వీరి సమస్యను పరిష్కరించి సర్టిఫికెట్లు అందించడంలో రెవెన్యూ అధికారుల స్పందన కరువైందని అన్నారు. ఆగస్టు 31న చివరి గడువు ఉండటంతో సర్టిఫికెట్ల కోసం గత తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని, ఏ ఒక్క ఒంటరి మహిళకు పింఛన్ రాకపోయినా ఆలేరు తహసిల్దార్, అధికారులే బాధ్యులన్నారు. ఆగష్టు 31 చివరి తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి, అర్హులైన ఒంటరి మహిళలకు సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



