నవతెలంగాణ – జుక్కల్
ప్రజావాణి కార్యక్రమాన్ని మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అధికారులకు రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. వీలైనంత మేర పరిష్కరిస్తామని చెప్పారు. మా పరిధిలో లేని వాటిని జిల్లా అధికారులకు నివేదికలు అందించి వారి సూచనల మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మార్వో మారుతి, ఎంపీఓ రాము, మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య, వెటర్నరీ డాక్టర్ పండరి, అటవీశాఖ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు హాజరయ్యారు.
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



